న్యూ ఇయర్‌ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

 న్యూ ఇయర్‌ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి

కల్వకుర్తి, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ డిసెంబర్‌ 31 రాత్రి వేడుకల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్‌ రైడింగ్‌, రాష్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడం, దాడులు, బెదిరింపులు వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రోడ్లపై వెళ్తున్న ప్రజలకు ఇబ్బందులు కలిగించినా చర్యలు తప్పవన్నారు. నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రి వేళల్లో ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గమనించి, వారు అనవసరంగా బయట తిరగకుండా నియంత్రణ చేపట్టాలని కోరారు. పోలీసుల ఆదేశాలకు సహకరిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై మాధవరెడ్డి ప్రజలను కోరారు.
Previous Post Next Post