గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

 గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

నూతన సంవత్సర వేళ విషాదం

మిడ్జిల్, డిసెంబరు 31 (మన ఊరు ప్రతినిధి): మండల పరిధిలోని లింబ్యా తండా సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వస్పుల గ్రామానికి చెందిన గొరిగే మదన్ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మదన్ జడ్చర్లలోని అరవింద్ కంపెనీలో విధులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా కల్వకుర్తి–జడ్చర్ల జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. నూతన సంవత్సరం వేళ చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో మదన్ కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Previous Post Next Post