ఈనెల 3న రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు....
నాగర్ కర్నూల్, జనవరి 1 (మనఊరు ప్రతినిధి); జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ నెల 3న శనివారం నాడు ఉదయం 10 గంటలకు పుష్య పౌర్ణమి నాడు సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ తెలిపారు. భక్తులు తమ వెంట పూజా సామాగ్రిని తెచ్చుకొని,వ్రతం లోపాల్గొనాలని కోరారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పనున్నట్లు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, రామాలయ అన్న ప్రసాద కమిటీ వారిచే అన్నప్రసాద భోజన వసతి భక్తులకు ఏర్పాటు ఉందని తెలిపారు.మరిన్ని వివరాలకు 94409 81253, 9492992056, నెంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.
