ఓటమి అడ్డుకాలేదు… ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ సర్పంచ్ నర్సింహులు
బాలానగర్, డిసెంబరు 31 (మనఊరు ప్రతినిధి): సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ గ్రామాభివృద్ధిపై తన నిబద్ధతను చాటుతూ, ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మాజీ సర్పంచ్ పులమోని నర్సింహులు. సూరారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త సూరారం గ్రామం 7వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కొరతను తీర్చేందుకు ఆయన స్వంత ఖర్చుతో సింగిల్ ఫేస్ మోటార్ను ఏర్పాటు చేసి, శుక్రవారం తన చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ పదవి ఉన్నా లేకపోయినా ప్రజల అవసరాలే తనకు ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. మోటార్ ఏర్పాటు కావడంతో 7వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పులమోని నర్సింహులును గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర యాదమ్మ, మాజీ సర్పంచ్ పాండయ్య గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లింగం, వార్డు సభ్యులు పూజారి స్వాతి, దుబ్బ ప్రసాద్, జావీద్, వడ్ల శారద, గ్రామస్తులు గడ్డల సత్యం, పూజారి నర్సిములు, రాపల్లి యాదయ్య, దుబ్బ కృష్ణ, సిల్వర్ యాదయ్య, నాగేష్, వడ్ల శేఖర్, నరేష్, దశరత్, దుబ్బ లక్మయ్య, దుబ్బ శివరాజు, సిల్వర్ కృష్ణ, మంగలి చెన్నయ్య, ఎలికట్టె సుదర్శన్, గొల్ల యాదయ్య, పూజారి సత్యయ్య, పూజారి మహేందర్, కుర్వ మల్లయ్య, కుర్వ రాములు, పులమోని రవి, కుమ్మరి వెంకటేష్, శెక్కర్ సత్తయ్య, కుర్వ అనిల్, పూజారి నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.
