**ఆశీర్వదించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా*
***సర్పంచ్ అభ్యర్థి కావలి రామకృష్ణ *
రాజాపూర్, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): రాజాపూర్ గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి ఓటు వేస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కావాలి రామకృష్ణ అన్నారు. గురువారం గ్రామంలో ఇంటింటికి తిరిగిఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామంలో సమస్యలైనా విద్యుత్ దీపాలు, సిసి రోడ్లు, తదితర సమస్యలు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సర్పంచిగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనతోపాటు తన ప్యానల్ లో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా గెలిపించాలన్నారు. సురేందర్, సత్యం, శ్రీధర్ రెడ్డి, బాలు వెంకట్, లింగం, పాల్గొన్నారు.
