*గ్రామ ప్రజలకు సేవకుడిగా పని చేస్తా **
*సర్పంచ్ అభ్యర్థి పూజారి శేఖర్*
రాజాపూర్, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఖానాపూర్ గ్రామ ప్రజలు సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామ ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని సర్పంచ్ అభ్యర్థి పూజారి శేఖర్ అన్నారు. గురువారం ఆయన ఖానాపూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఆదరించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటు పడుతారని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు అన్ని గెలిచిన వెంటనే పరిష్కరిస్తారన్నారు. గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలన్నారు. తనతోపాటు తన వార్డు సభ్యులు అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
