*గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా **
---సర్పంచ్ అభ్యర్థి గోనెల రమేష్
రాజాపూర్, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): రాజాపూర్ గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి గోనెల రమేష్ అన్నారు. గురువారం గ్రామంలో గడపగడపకు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామంలో నెలకొన్న ఏ సమస్య అయినా ఎమ్మెల్యే సహాయకారంతో ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. తనకు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు తనతో పాటు తన ప్యానెల్ లో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాన ని అన్నారు. శ్రీధర్ రెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి,నరహరి,విక్రమ్ రెడ్డి,అనంతుల వెంకటేష్, కృష్ణయ్య,ప్రసాద్, ప్రశాంత్, వెంకటేష్, ప్రజలు యువకులు ప్రజలు యువకులు పాల్గొన్నారు.
