లక్ష్మీ శాంతి పూజలకు ప్రజలందరూ హాజరుకావాలి

 చర్లపల్లిలో లక్ష్మీ, శాంతి పూజలకు ప్రజలందరూ హాజరుకావాలి

సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ పిలుపు

జడ్చర్ల రూరల్‌, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని చర్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద లక్ష్మీదేవి పూజ, శాంతి పూజ కార్యక్రమాలు మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించిన గ్రామ సర్పంచ్ జోగు లక్షమ్మ వెంకటరమణ తెలిపారు. ఇటీవల గ్రామ ప్రజలచే నూతనంగా ఎన్నుకోబడిన గ్రామపంచాయతీ పాలకమండలి, డిప్యూటీ సర్పంచ్, వార్డు సభ్యులు స్వీకరించిన సందర్భంగా ఈ పూజ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. గ్రామంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ దరఖాస్తు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ గ్రామపంచాయతీ పాలకమండలి ప్రత్యేకంగా నిర్దేశించబడింది.

Previous Post Next Post