ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని టీబీ అధికారి ఆకస్మిక తనిఖీ

టీబీ అధికారి ఆకస్మిక తనిఖీ

 క్షయ వ్యాధి నిర్మూలన అధికారి రఫిక్.

నాగర్ కర్నూల్, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న సి. బి. నాట్ టి.బి ల్యాబ్ ను శనివారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా క్షయ నిర్మూలన ప్రోగ్రామ్ అధికారిగా డాక్టర్ రఫీక్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా సిబినాట్ ల్యాబ్ ను సందర్శించారు. ల్యాబ్ లో ఉన్న రెండు సిబి నాట్ మిషన్లను పరిశీలించి, శాంపిల్స్ , రోజుకి ఎన్ని పరీక్షలు చేస్తున్నారనీ ల్యాబ్ టెక్నీషియన్ సత్యారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ లో ఉన్న సమస్యల పట్ల వాకబ్ చేశారు.ల్యాబ్ తో పాటు నాగర్ కర్నూల్ టీబి యూనిట్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నూతనంగా వచ్చిన మొబైల్ ఎక్స్రేను అడిగి తెలుసుకున్నారు. క్షయ వ్యాధి అనేది వయస్సు తేడా లేకుండా అందరికీ అన్నివేళల్లో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ప్రోగ్రాం అధికారి రఫిక్ సదరు ఉద్యోగులకు సూచించారు. తెమడ పరీక్షలు ప్రతి ఒక్కరికి సులభరీతిలో అందేటట్లు చూడాలని సదరు ఉద్యోగులను ఆదేశించారు. గ్రామ గ్రామాన వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షా కేంద్రాలకు రప్పించి తెమడ పరీక్షలు చేయాలని సూచించారు. అవసరమైన వారికి సకాలంలో మందులు అందించి వారిని వారి కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అధికారి సూచించారు. ప్రోగ్రామ్ అధికారితో పాటు టీబి సూపర్వైజర్లు శ్రీనివాసులు, ఆరిఫ్ ఖాన్, ఎల్టి సత్య రెడ్డి పాల్గొన్నారు.




Previous Post Next Post