సమానత్వ మార్గం యువతకు శాశ్వత ప్రేరణ

అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గం యువతకు శాశ్వత ప్రేరణ

వ్యవసాయ కళాశాల–పాలెంలో మహాపరినిర్వాణ దినోత్సవం


బిజినెపల్లి, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి):
భారత శిల్పి, మహానుభావుడు, సామాజిక సంస్కరణకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవాన్ని వ్యవసాయ కళాశాల, పాలెం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగింది. 1956 డిసెంబర్ 6న పరమపదించిన అంబేద్కర్‌ను ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు పుష్పాంజలి అర్పించి ఆయన సేవలను స్మరించారు. అందుబాటులో కళాశాల ఇన్‌చార్జ్ అసోసియేట్ డీన్ డా. వి. అనిత అధ్యక్షత వహించారు. డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రూపకల్పనలో పోషించిన పాత్ర, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన అహర్నిశలు శ్రమ, ఆయన ప్రతిపాదించిన సమానత్వ–సామాజిక న్యాయం సిద్ధాంతాల గురించి ఆమె విద్యార్థులకు వివరించారు. అంబేద్కర్ ఆలోచనలు నేటి సమాజ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎన్. నవత, వి. శ్రీరమ్య సమన్వయం చేశారు. విద్యార్థుల్లో సామాజిక, బాధ్యత మానవతా విలువలు, న్యాయం పట్ల అవగాహన పెంపొందించడంలో ఎన్ఎస్ఎస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వారు వివరించారు. ఈకార్యక్రమంలో బోధనా సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన రచనలు, రాజ్యాంగ నిర్మాణంపై వ్యాసాలు, ప్రసంగాలు చేశారు. మానవ హక్కులు, సమానత్వం, విద్య హక్కు, దళితుల స్వాభిమానంలో అంబేద్కర్ పోషించిన పాత్ర దేశాన్ని నూతన దిశలో నడిపించిందని విద్యార్థులు పోరాడారు. ఆయన బోధనలను ఆచరణలో పెట్టి దేశ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని సంకల్పం వ్యక్తం చేశారు.
Previous Post Next Post