ట్రేడ్ లైసెన్స్ పేరుతో ఫేక్ కాల్స్…
వ్యాపారులు జాగ్రత్త!
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు పోయే ప్రమాదం
జడ్చర్ల, డిసెంబర్ 1 (మనఊరు ప్రతినిధి):
పట్టణంలోని వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఫేక్ ట్రేడ్ లైసెన్స్ కాల్స్ వస్తున్నాయని జడ్చర్ల పురపాలక సంఘం అప్రమత్తం చేసింది. శానిటేషన్ విభాగం పేరుతో 8332067220, 8977316221 నంబర్ల నుంచి కాల్ చేసి,
క్యూఆర్ కోడ్ పంపించి స్కాన్ చేయాలని ఒత్తిడి చేస్తూ మోసగాళ్లు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఈ కాల్స్‌కు స్పందిస్తే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు. ఫోన్ ద్వారా లైసెన్స్ ఫీజులు వసూలు చేసే వ్యవస్థ పురపాలక సంఘంలో లేదని స్పష్టం చేశారు. కమిషనర్ పేరు చెప్పి వాసులు చేస్తున్నారని, అలావి ఎవి కూడా వ్యాపారులు నమ్మవద్దని సూచించారు.
వ్యాపార లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు
- నేరుగా CDMA Telangana అధికారిక వెబ్‌సైట్ ద్వారా, లేదా
- జడ్చర్ల పురపాలక కార్యాలయంలోని శానిటేషన్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
సందేహాలు / సమాచారం కోసం:
- శానిటరీ ఇన్స్పెక్టర్: 62811 3925
- వార్డు ఆఫీసర్: 90108 94108
ప్రజలు మోసపోకుండా జాగ్రత్త వహించాలని కమిషనర్ సూచించారు.

