వార్డు అభివృద్ధి ఏ ముఖ్యం
-- 12వ వార్డు అభ్యర్థి అనంతుల వెంకటేష్
రాజాపూర్, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): రాజాపూర్ గ్రామ 12వ వార్డులో సిసి రోడ్లను నిర్మిస్తామని 12వ వార్డు అభ్యర్థి అనంతుల వెంకటేష్ అన్నారు. సిసి రోడ్లు, పరిశుభ్రత, అండర్ డ్రైనేజ్ విద్యుత్ పలు సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. 12వ వార్డులో గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు.తనకు కేటాయించిన గౌను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తనతో పాటు సర్పంచ్ అభ్యర్థి గోనెల రమేష్ కి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
