పోల్కేపాడులో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
గోపాల్పేట, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గోపాల్పేట మండలంలోని పోల్కేపాడు గ్రామంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదల బతుకుల్లో ఆశలు నింపుతోంది. రిజర్వేషన్లు వారికి కూడు గూడు గుడ్డ అందిస్తున్నాయి. అదే రాజ్యాంగంలోని లోపాలను దుర్వినియోగం చేస్తూ అక్రమార్కులు జరుపుతున్న అవినీతిని ఎండగడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే, సమాజం కోసం పనిచేసే వారిని ఆశీర్వదించడం అందరి కర్తవ్యం. అందుకే ఈరోజు పోలికేపాడు వచ్చి సర్పంచ్ అభ్యర్థి బంగారయ్య గెలుపుకు మేము కృషి చేస్తున్నాం. 40 ఏళ్లుగా గ్రామాన్ని పట్టిపీడిస్తున్న శనిని వదిలించుకోవాలంటే ప్రజలు మంచి నాయకత్వం ఎంచుకోవాలి అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ మైబూస్, గ్రామ సర్పంచ్ అభ్యర్థి బంగారయ్య, వెంకటేశ్వర్లు, కురుమయ్య, రామస్వామి, నాగరాజు, రమేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
