నారాయణపురం కాంగ్రెస్ అభ్యర్థిగా మడకం కుమారి
తమ ఇంటి ఆడబిడ్డలా గెలిపించండి
ఓటర్లను కోరిన కాంగ్రెస్ అభ్యర్థి
అశ్వారావుపేట, నారాయణపురం, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): నారాయణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మడకం కుమారి ఆంధ్రయ్య బరిలో నిలిచారు. గ్రామ అభివృద్ధి ఇల్లు ఇల్లు చేరాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలి. నన్ను మీ ఇంటి ఆడబిడ్డలా భావించి అత్యధిక మెజారిటితో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. గ్రామంలోని పది వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులు ఈ విధంగా ప్రకటించారు. 1వ వార్డ్ సోయం ప్రసాద్, 2వ వార్డ్ కుంజా స్వర్ణ, 3వ వార్డ్ గొంది సునీత, 4వ వార్డ్ మడకం అందరయ్య, 5వ వార్డ్ పెదపూడి సత్యవతి, 6వ వార్డ్ మడకం పుల్లారావు, 7వ వార్డ్ ఎడ్లపల్లి రమేష్, 8వ వార్డ్ ఆకుల శ్రీను, 9వ వార్డ్ కుంజా రాంబాబు, 10వ వార్డ్ పాయం జగదాంబా అభ్యర్థులందరిని భారీ మెజారిటీతో గెలిపిస్తే నారాయణపురం పంచాయతీని అశ్వారావుపేట మండలంలో ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని మడకం కుమారి హామీ ఇచ్చారు.
