మార్చాలలో కాంగ్రెస్ అభ్యర్థి భారతమ్మ ప్రచారం వేగవంతం
బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరిన అభ్యర్థి
కల్వకుర్తి, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. గుర్తులు వచ్చిన వెంటనే అభ్యర్థులు గ్రామంలో తిరుగుతూ తమ మద్దతుదారులను ఉత్సాహపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భారతమ్మ శుక్రవారం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల అండగా నిలుస్తుందని ఆమె ప్రజలకు వివరించారు. ప్రచారంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలతో ఉత్సాహాన్ని నింపారు. గ్రామంలో ఎన్నికల సందడి మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.
