సర్పంచ్ గా గెలిపిస్తే రెండు ఎకరాల భూమిలో ప్లాట్లు ఇస్తాం..

 నన్ను గెలిపిస్తే రెండు ఎకరాల భూమిలో ప్లాట్లు ఇస్తా...

లింగారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి మాజీ సైనికుడు అన్వర్ పాషా

కల్వకుర్తి, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో హామీలు ప్రజలను మెప్పు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు, సర్పంచ్ అభ్యర్థి అన్వర్ పాషా తన సొంత వ్యవసాయ భూమిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో నిరుపేదలకు ప్లాట్లు చేసి ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నారు. ఇవే కాకుండా గ్రామంలోని పలు గ్రామ దేవతలను ప్రతిష్ట చేస్తానని,గ్రామంలోని హనుమాన్ దేవాలయానికి ప్రవహరీ గోడ నిర్మిస్తానని, గ్రామ బొడ్రాయి పండుగను తన సొంత డబ్బులతో నిర్వహిస్తానని మసీదులకు, చర్చిలకు తన సొంత డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీలు ఇవ్వడంతో వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో ఒక రాజకీయ వాతావరణం ఏర్పడింది.

Previous Post Next Post