మార్కెట్లో వేరుశనగ ధరలకు జోరు

 కల్వకుర్తి మార్కెట్లో వేరుశనగ ధరలకు జోరు

క్వింటాలుకు గరిష్ఠంగా రూ.8,218

కల్వకుర్తి రూరల్, డిసెంబరు 29 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుశనగ ధరలు ఆశాజనకంగా నమోదయ్యాయి. మార్కెట్లో వేరుశనగ క్వింటాలుకు గరిష్ఠంగా రూ.8,218 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మొదటి రకానికి రూ.8,218, రెండో రకానికి రూ.8,001, మూడో రకానికి రూ.7,209 చొప్పున ధర లభించింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు మొత్తం 81 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడిని విక్రయానికి తీసుకువచ్చారు. ప్రస్తుత ధరలు అనుకూలంగా ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత ధరల పెరుగుదల ఉండే అవకాశముందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.

Previous Post Next Post