టిజిఎస్ఆర్టిసి సెక్యూరిటీ గార్డులకు జీతాలు పెంచాలని వినతి

 టిజిఎస్ఆర్టిసి అవుట్‌సోర్సింగ్ సెక్యూరిటీ గార్డులకు ఐడీ నంబర్లు, జీతాలు పెంచాలని వినతి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 22 మంది సిబ్బంది ఆవేదన

మహబూబ్‌నగర్, డిసెంబర్ 29 (మనఊరు ప్రతినిధి): టిజిఎస్ఆర్టిసి అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు కూడా డ్రైవర్లు, కండక్టర్ల మాదిరిగా స్టాఫ్ నంబర్ లేదా ఐడీ నంబర్ కేటాయించాలని అవుట్‌సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ బస్టాండ్లలో మొత్తం 22 మంది సెక్యూరిటీ గార్డులు గత ఏడాది ఐదు నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు తమకు ఐడీ నంబర్లు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 8 గంటల డ్యూటీ, వారానికి ఒక రోజు సెలవుతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు నెలకు కేవలం రూ.15,000 మాత్రమే జీతం అందుతోందని తెలిపారు. ఇదే తరహా విధులు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన హోంగార్డులకు ప్రభుత్వ భద్రతా కార్డు, నోటిఫికేషన్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతం, నెలకు రూ.30,000కు పైగా జీతం లభిస్తోందని వారు పోల్చిచూపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ విధులను పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్ట్ విధానాన్ని తొలగించి, జీతాలను నేరుగా టీ జి ఎస్ ఆర్ టి సి ద్వారా చెల్లించే విధానం అమలు చేస్తే న్యాయం జరుగుతుందని వారు కోరారు. అలాగే ప్రతి నెల బస్ పాస్ రీన్యువల్ అవసరం లేకుండా, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా సంవత్సరానికి ఒకసారి బస్ పాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్‌ఎం, డీఎం అధికారులు తమపై దయవుంచి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతి తెలిపిన సెక్యూరిటీ గార్డులు ఆఆదిరాలనరేందర్, లింగంపేట నర్సింలు, రాకేష్, విజయరాజు, కావలి పరశురాములు, రేమత్ బాబా, వెంకట్ రాములు, రాజు, ఆకుల సిద్ధప్ప, రమేష్, రాజు తదితరులు ఈ డిమాండ్లను వెల్లడించారు.

Previous Post Next Post