విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పెంపే లక్ష్యం

 ఆవిష్కరణలకు వేదికగా బాల వైజ్ఞానిక ప్రదర్శన

చిన్ననాటి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచాలి 

జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్

నాగర్‌కర్నూల్, డిసెంబరు 29 (మనఊరు ప్రతినిధి): విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో డీఈవో రమేష్ తో కలిసి ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని, నూతన ఆలోచనలతో ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని సూచించారు. సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రకృతిలోని సత్యాలను శాస్త్ర విజ్ఞానం ద్వారానే తెలుసుకోవచ్చని తెలిపారు. సమాజ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా సైన్స్ ద్వారానే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను పరిశీలించిన కలెక్టర్, వారి ప్రతిభను అభినందించారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీఈవో రమేష్‌తో కలిసి బాల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్, విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నించి వారి ఆలోచనలు, నమూనాల తయారీ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ప్రదర్శనలో 360 ఎగ్జిబిట్లు, 93 ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు సైన్స్ ఫెయిర్‌లో భాగం, సైన్స్ కార్యక్రమాలపై డీఈవో, జిల్లా సైన్స్ అధికారి వివరాలు, జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసలు, బల్మూర్ విద్యార్థి గగన్ చందుకు యువ శాస్త్రవేత్త అవార్డు, ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులు అవలంబించాలి, డీఈవో సూచన విద్యా అభివృద్ధికి కలెక్టర్ చేస్తున్న కృషిపై ప్రశంసలు అందుకున్నారు.

సాంస్కృతిక శోభ

మాస్టర్ మైండ్ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించగా, కేజీబీవీ తాడూర్, పెద్దకొత్తపల్లి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






Previous Post Next Post