ఆరోగ్య చైతన్యానికి శారద సేవలు అభినందనీయం
డిస్ట్రిక్ట్ 304 గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు
కరీంనగర్, జనవరి 5 (మనఊరు ప్రతినిధి): మహిళల్లో వాకింగ్, యోగా ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో కృషి చేస్తున్న శారద సేవలు అభినందనీయమని డిస్ట్రిక్ట్ 304 గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు అన్నారు. ఎస్‌ఆర్‌ఆర్ గ్రౌండ్ లో వాకర్ ఇంటర్నేషనల్ నిర్వహించిన కార్యక్రమం డిస్ట్రిక్ట్ 304 గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిరాజు, ప్రభావతిలు కలిసి శారదను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణలో ఆమె చేస్తున్న సేవలను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ వాకింగ్, యోగా, సాత్విక ఆహారం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆరోగ్య చైతన్యం కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. మహిళా మిత్రుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సన్మానం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరణగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో మహిళా వాకర్ వెల్‌ఆర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శాంతి, కోశాధికారి సరోజ, ఉపాధ్యక్షురాలు రాజమణి, గౌరవ సభ్యురాలు పద్మతో పాటు 304 వాకర్ రమణ రెడ్డి, రవీందర్, రఘునందన్ అసోసియేషన్ నాయకులు రాజు, వాటర్స్ తదితరులు పాల్గొన్నారు.

