108 అంబులెన్సులపై ఆకస్మిక తనిఖీ
ఎమర్జెన్సీ పరికరాలు సిద్ధంగా ఉంచాలి
జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జాన్ సాహిద్
వెల్దండ, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలో సేవలందిస్తున్న 108 అంబులెన్సులపై బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జాన్ సాహిద్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసులు వెల్దండలోని 108 అంబులెన్సును పరిశీలించారు. ఈ సందర్భంగా అంబులెన్సులో ఎమర్జెన్సీ సమయంలో అవసరమయ్యే అత్యవసర వైద్య పరికరాలు, ఔషధాలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నదాన్ని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆపద సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత అంబులెన్స్ సిబ్బందిపై ఉన్నందున, పరికరాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని సూచించారు. అలాగే సేవలందించడంలో అప్రమత్తత, వేగం, నిబద్ధత తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా అంబులెన్స్ సిబ్బంది మల్లేష్, సాయిబాబు పాల్గొన్నారు.
