ఈనేల 10న జిల్లా ఆత్మీయ అభినందన సన్మాన సభ....
జిల్లాలోని బీసీ,ఎస్సీ ,ఎస్టీ గ్రామపంచాయతీ ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం..
బీసీ సంఘం మండల అధ్యక్షులు వేముల సత్య శీల సాగర్....
నాగర్ కర్నూల్, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డు సభ్యులకు ఈనెల 10న శనివారం నాడు ఉదయం 9 గంటలకు బీజీనపల్లి మండల కేంద్రంలోని ఎం.జె.ఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా ఆత్మీయ అభినందన సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు బిసి సంఘం మండల అధ్యక్షులు వేముల సత్య శీల సాగర్,గౌరవాధ్యక్షులు దాసర్ల వెంకటస్వామి లు తెలిపారు.బిజినపల్లి మండల బి.సి.సంఘం,మంగనూర్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘం ఆధ్వర్యంలో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు విశ్రాంత కలెక్టర్ టి.చిరంజీవులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారాదన్ మహారాజ్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని వారు తెలిపారు. ఐదు సంవత్సరాలపాటు సమాజంలో ప్రజాప్రతినిధుల నిర్వహించే పాత్ర పై వివరంగా అవగాహన చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని బీసీ,ఎస్సీ,ఎస్టీ నూతన ప్రజాప్రతినిధులు, బహుజన నాయకులు,కళాకారులు, కవులు హాజరుకావాలని వారు కోరారు.వివరాలకు 9133990933,9440856075 నెంబర్ లలో సంప్రదించాలన్నారు.

