ఓం నగర్‌లో ధనుర్మాస ప్రత్యేక పూజలు
11న కుడారై ప్రసాద ఉత్సవం
13న గోదాదేవి కల్యాణోత్సవం
నాగర్ కర్నూల్, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ఓం నగర్ కాలనీలో గల శ్రీ పబ్బతి అంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మాడభూషి అజయ్ కుమార్ శర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 11వ తేదీ ఆదివారం నాడు కుడారై ప్రసాద ఉత్సవం, ఈ నెల 13వ తేదీ మంగళవారం నాడు గోదాదేవి, రంగనాయక స్వామివారి కల్యాణోత్సవం ఆలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవీదేవతల అనుగ్రహం పొందాలని కోరారు. ముఖ్యంగా గోదాదేవి కల్యాణోత్సవంలో పాల్గొనదలచిన భక్తులు ముందస్తుగా ఆలయ పూజారిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమాల వివరాల కోసం భక్తులు నేరుగా ఆలయాన్ని సందర్శించవచ్చునని లేదా 94417 40951 సెల్ నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
