ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటిన వైద్యులు...
ఈనెల 12న పారిశుద్ధ కార్మికులకు ముగ్గుల పోటీలు...
డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్..
నాగర్ కర్నూల్, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ తెలిపారు. ఆస్పత్రి ఆవరణ శుభ్రతతో పాటు పచ్చదనం ఉండేందుకు పలు మొక్కలను ఖాళీ స్థలాలలో వైద్యులు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి.శేఖర్ నాటి నీరు పోశారు. ఆసుపత్రి కి వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వార్డులలో శుభ్రత పాటింపు పై ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఓపి, ఐ.పి విభాగాలు శుభ్రంగా ఉండాలని ఆయన సూచించారు.ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పారిశుధ్య సేవలందిస్తున్న కార్మికులకు,సిబ్బందికి ఈ నెల 12న ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలుపొందిన వారికి నగదు పారితోషికం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ రాణిదేవి, నర్సింగ్ అధికారి ఆనంద్, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ యాదగిరి, సానిటేషన్ సిబ్బంది నాగరాజు, మహేష్, శేఖర్, రాజు, రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




