ఈనెల19 నుంచి 23 వరకు శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ15వ వార్షిక బ్రహ్మోత్సవాలు....
ప్రతిరోజు చిన్నారులకు అక్షరాభ్యాసాలు,అన్నప్రాస, గో పూజలు...
ఈనెల 22న చండీ హోమం..
ఈనెల 23న వసంత పంచమి విశేష అక్షరభ్యాసాలు వేడుకలు,సరస్వతి హోమం...
ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు ఉచిత అన్నప్రసాద పంపిణీ...
నాగర్ కర్నూల్, జనవరి 16 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు జ్ఞాన సరస్వతి దేవాలయంలో మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ పంచమి వరకు ఈనెల19 నుండి 23వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు జ్ఞాన సరస్వతి దేవాలయ అధ్యక్షులు ఆకారపు విశ్వనాథం ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్యలు తెలిపారు.గత 14సంవత్సరాల నుండి ప్రతిరోజు దేవాలయంలో గోపూజ,అమ్మవారికి త్రికాల పూజలు జరుగుతున్నట్లు తెలిపారు.ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 19న మహాభిషేకం,అఖండ దీపారాధన,గోపూజ,గణపతి పూజ,పుణ్యావాచనం, రక్షాబంధనం,పంచగవ్య ప్రాశనం,మండపారాధన, నవగ్రహ మండప అంకురార్పణ,మండప పూజలు,ప్రత్యేకంగా గణపతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈనెల 20న మంగళవారం నాడు సరస్వతి అమ్మవారికి మూలవిరాట్ కు సామూహిక అభిషేకాలు, గోకల్యాణము,తులాభారం,ఓం శ్రీ రక్ష కోలాట బృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈనెల 21న బుధవారం నాడు ఉత్సవ విగ్రహానికి పాఠశాల విద్యార్థులచే సామూహిక అభిషేకాలు,శ్రీ గాయత్రి హోమము, దైవభక్తి -దేశభక్తి పాటల కచేరీ కార్యక్రమము ఉన్నట్లు తెలిపారు.ఈనెల 22న గురువారం నాడు శ్రీ గురు దత్తాత్రేయ హోమము,9గంటలకు చండి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సాయంత్రం4 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 23న మాఘ శుక్ల పంచమి,మాఘ పంచమినాడు అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా బాలగోమాతకు డోలారోహణం,ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈనెల 23న చిన్నారులకు విశేష అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నామని అక్షరాభ్యాసం చేయించుకునే తల్లిదండ్రులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు.గణపతి హోమం,చండీ హోమం, గాయత్రి హోమం,నవగ్రహ హోమం,గోకళ్యాణం ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనే భక్తులు,దంపతులు సాంప్రదాయ దుస్తులలో పాల్గొనాలని వారు కోరారు. వివరాలకు 6301083132, 9949031319 లలో సంప్రదించలని వారు కోరారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు అమ్మవారికి పల్లకి సేవ దేవాలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం జ్ఞాన సరస్వతి దేవాలయ సేవా ట్రస్టు ద్వారా పాల్గొన్న భక్తులందరికీ నిత్య అన్న ప్రసాద పంపిణీ ఉన్నట్లు తెలిపారు.ఈ ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.


