20న ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల ఆరోగ్య దినోత్సవ ప్రత్యేక శిబిరం

 20న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల ఆరోగ్య దినోత్సవ ప్రత్యేక శిబిరం

మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, అర్హులకు చికిత్సలు

డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్

నాగర్ కర్నూలు, జనవరి 18 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్యని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఈనెల 20వ తేదీ మంగళవారం మహిళల ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆరోగ్యం శిబిరం వైద్యులు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపర్‌డెంట్ డాక్టర్ వి.శేఖర్ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు, వివిధ ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ఎంతో అవసరమని అన్నారు. ఈ ప్రత్యేక శిబిరంలో మహిళలకు సమగ్ర వైద్య పరీక్షలు చేశారు.  ప్రభుత్వ ఆసుపత్రిలోని నెంబర్ 24లో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ నీలిమ, డాక్టర్ సుప్రియ వారి వైద్య బృందం మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు జరిగాయి.  రుతుక్రమ సమస్యలు, గర్భాశయ సంబంధిత వ్యాధులు, గర్భాశయంలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్, సిస్టులు, రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలు ఈ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. పరీక్షలకు హాజరైన మహిళలు గతంలో చేసిన రిపోర్టులు, స్కానింగ్ వివరాలు, ఇతర చికిత్స రిపోర్టులు మరియు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. 

Previous Post Next Post