మౌని అమావాస్యనాడు పాలెం హనుమాన్ దేవాలయంలో ప్రకృతి పూజలు
మొక్కల్లోనే సర్వదేవతల నివాసం
భక్తుల విశ్వాసం
బిజినేపల్లి, జనవరి 18 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని పాలెం గ్రామంలో వ్యవసాయ కళాశాల ఎదురుగా ఉన్న హనుమాన్ దేవాలయంలో మౌని అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం ఘనంగా ప్రకృతి పూజలు జరిగాయి. హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో, భక్తుల సమక్షంలో హనుమాన్ భక్తుడు ఆర్. లక్ష్మణ్ ఈ కార్యక్రమం జరిగింది. ప్రకృతిలో సహజంగా వెలిసిన బిల్వం, జమ్మి, జిల్లేడు, వేప, ఉసిరి, రాగి, మల్లె, తులసి మొక్కలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్నారు. జరిగింది. జరిగింది. ప్రకృతిని ఆరాధిస్తే అన్ని శుభాలు కలుగుతాయి, ప్రతి మొక్కలోను, ప్రతి వృక్షంలోను సర్వదేవతలు నివసిస్తారని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు. అనంతరం గురుస్వామి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పరమశివునికి పంచామృతాలతో పాటు విశేష ద్రవ్యాలతో అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ప్రతి ఆదివారం ప్రకృతి మొక్కలకు పూజలు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఖానాపూర్‌కు చెందిన ఇంద్ర వెంకట్ రాములు భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి సురేష్, ఆలయ కమిటీ సభ్యులు శేఖర్, వినయ్, యశోద, కృష్ణవేణి, నందకిషోర్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.

