జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్రీటింగ్ కార్డుల ప్రదర్శన

 నూతన సంవత్సర వేడుకల్లో విద్యార్థుల సృజనాత్మకత వెల్లువ

మరికల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్రీటింగ్ కార్డుల ప్రదర్శన

చౌడాపూర్, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరికల్‌లో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థులు చిత్రలేఖన కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. చిత్రకళ ఉపాధ్యాయులు కమ్మరి పాండురంగయ్య చారి సూచనలతో విద్యార్థులు రకరకాల ఆకర్షణీయమైన గ్రీటింగ్ కార్డులను తయారు చేసి ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగళ, గ్రామ సర్పంచ్ ఇందిరా సత్యకుమార్, మండల విద్యాధికారి రాంచందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిత్రకళతో పాటు అన్ని రంగాల్లోనూ చురుకుగా పాల్గొని ప్రతిభను వెలికితీయాలని సూచించారు.

చిత్రలేఖనంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ, మల్లప్ప, రామకృష్ణ, వెంకటయ్య, హనుమయ్య, ఇస్మాయిల్, శ్రీలక్ష్మి, రేఖ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



Previous Post Next Post