గొప్లాపూర్ ప్రీమియర్ లీగ్–3 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

 గొప్లాపూర్ ప్రీమియర్ లీగ్–3 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

సంక్రాంతి సంబరాల్లో యువత ఉత్సాహం 

సర్పంచ్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

జడ్చర్ల రూరల్, జనవరి 15 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని గొప్లాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన గొప్లాపూర్ ప్రీమియర్ లీగ్–3 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో విజయం సాధించిన జట్లకు గురువారం గ్రామ సర్పంచ్ శివవర్ధినమ్మ ఆరోగ్యం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. టోర్నమెంట్‌లో ప్రథమ బహుమతిని చెన్నయ్య టీం గెలుచుకోగా, ద్వితీయ బహుమతిని శ్రీహరి టీం సాధించింది. ఈ సందర్భంగా సర్పంచ్ శివవర్ధినమ్మ మాట్లాడుతూ గ్రామ యువత క్రీడల్లో పాల్గొనడం ఆనందకరమని, ఇలాంటి క్రీడా పోటీలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెన్నయ్య, మార్కెట్ డైరెక్టర్ వనం కృష్ణ, డిప్యూటీ సర్పంచ్ విజయ్, షేగోలా రమేష్, ఎకనాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బి. శ్రీనివాస్ తదితర గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని విజేతలను అభినందించారు.




Previous Post Next Post