జడ్చర్ల విద్యార్థి వీరేంద్ర వినూత్న సృజన
స్వయంకృషితో తయారీ… పర్యావరణ పరిరక్షణకు సందేశం
జడ్చర్ల, జనవరి 15 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పట్టణానికి చెందిన వీరేంద్ర 7వ తరగతి చదువుతున్న స్వామి నారాయణ గురుకుల్ విద్యార్థి, తన సృజనాత్మకతతో అందరి దృష్టిని ఆకర్షించాడు. పాత న్యూస్ పేపర్లను ఉపయోగించి, స్వయంగా ఆలోచించి పెద్ద పతంగిని తయారు చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా వ్యర్థ వస్తువులను పునర్వినియోగం చేస్తూ, పూర్తిగా తన స్వంత ఆలోచనలతో ఈ పతంగిని రూపొందించడం అభినందనీయమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. చిన్న వయసులోనే సృజనాత్మకత, ఆవిష్కరణ గుణాలు ప్రదర్శించడం గర్వకారణమని ఉపాధ్యాయులు, పెద్దలు పేర్కొన్నారు. వీరేంద్ర చేసిన ఈ ప్రయత్నం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, చదువుతో పాటు ఇలాంటి సృజనాత్మక కార్యకలాపాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.
