తాండ్రలో ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

 తాండ్రలో ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

సంక్రాంతి సంబరాల్లో యువత ఉత్సాహం 

మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

కల్వకుర్తి రూరల్ జనవరి 16 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని తాండ్ర గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన తాండ్ర ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో విజయం సాధించిన జట్లకు శుక్రవారం మాజీ సర్పంచ్ గోలి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయకుమార్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ఒక. టోర్నమెంట్‌లో ప్రథమ బహుమతిని అశోక్ టీం గెలుచుకోగా, ద్వితీయ బహుమతిని కాయితి భూపాల్ రెడ్డి టీం పొందింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గోలి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయకుమార్ రెడ్డిలు మాట్లాడుతూ గ్రామ యువత క్రీడల్లో పాల్గొనడం ఆనందకరమని, క్రీడాకారిణి పోటీలు స్నేహభావాన్ని పెంచుతుందని అన్నారు. అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి సమకూర్చిన టీషర్ట్ లుక్రిడాకారులకు ఈ కార్యక్రమంలో నాయకులు, క్రిడాకారులు, నిర్వహించారు.


  


Previous Post Next Post