ఘనంగా శివ దీక్షా స్వాముల శివపడి పూజ కార్యక్రమం..
నాగర్ కర్నూల్, జనవరి 16 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని మధుర నగర్ కాలనీ రూబీ గార్డెన్ దగ్గర కిషన్ నాయక్ శివ స్వామి నివాసంలో శివ పూజ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు శివదీక్షా స్వాములు ఘనంగా శివ పడి పూజ నిర్వహించారు. శివ స్వాముల పూజ కార్యక్రమాన్ని గురుస్వాములు బుజ్జన్న, వినోద్, సురేష్ ఆధ్వర్యంలో శివ పూజ నియమ నియమావళితో పరమశివలింగానికి అభిషేకం చేస్తూ, పూజా నియమావళిని ఘనంగా నిర్వహించారు. శివ స్వాములు శివపాటాలతో మారు మ్రోగించారు. శివ దీక్ష తీసుకున్న స్వాములకు భజన కీర్తనలతో కొనసాగించారు. అనంతరం తీర్థ ప్రసాదములతో పాటు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా గురుస్వాములకు కండువాలతోసత్కరించారు. ఈకార్యక్రమంలో గురు స్వాములు కొండకింది మాధవరెడ్డి, కురుమూర్తి, శివ, అడివయ్య, అదేవిధంగా శివ స్వాములు చిట్యాల వెంకటేష్, గోపాల్ నాయక్, కాశి, నిరంజన్, చెర్రీ, శ్రీకాంత్, శివ, వెంకటేష్, రమేష్, నాగరాజు, అదిరేపల్లి శ్రీను, రవి, మల్లేష్, శివ, మధు, అశోక్ తో పాటు శివ స్వాములు అధిక సంఖ్యలో హాజరయ్యారు.




