రామాలయానికి రూ.41 వేల విలువైన ఫర్నిచర్ అందజేత

 రామాలయానికి రూ.41 వేల విలువైన ఫర్నిచర్ అందజేత



నాగర్ కర్నూల్, జనవరి 30 (మనఊరు ప్రతినిధి): దాతృత్వం చాటుకున్న వైద్యులు డాక్టర్. హేమంత్ కుమార్, డాక్టర్. ప్రియాంక నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం రూ.41 వేల విలువైన ఫర్నిచర్‌ను వైద్యులు దానంగా అందజేశారు. నాగర్ కర్నూల్‌కు చెందిన శ్రీ హేమంత్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ కుమార్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రియాంకలు మూడు స్టీల్ బెంచీలు, 25 కుర్చీలను ఆలయ ప్రధాన అర్చకులు కందడై వరదరాజన్ అయ్యంగార్‌కు అందజేశారు. రామాలయంలో నిత్య పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పూజల సందర్భంగా భక్తులు వినియోగించుకునేలా ఈ ఫర్నిచర్ ఉపయోగపడుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో అర్థం రవీందర్, గొల్ల రాములు, మన్యపు రెడ్డి, రమాదేవి, శారద, పాండురంగయ్యతో పాటు స్వామి భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

Previous Post Next Post