ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా
పత్తిపాటి లక్ష్మీకాంతమ్మకు గద్దర్ స్ఫూర్తి అవార్డు
గద్దర్ స్ఫూర్తి అవార్డు డా. పత్తిపాటి లక్ష్మీకాంతమ్మకు ప్రదానం
హైదరాబాద్, జనవరి 30 (మనఊరు ప్రతినిధి): ప్ర జాయుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ జయంతిని పురస్కరించుకొని తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని నందమూరి తారక రామారావు కళామందిరంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో తన గళంతో ప్రజలను చైతన్యపరిచిన ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రజాకవి **డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మకు ‘గద్దర్ స్ఫూర్తి అవార్డు’**ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్, పుడమిక్ సాహితీ వేదిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం ఈ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అవార్డును గద్దర్ ముద్దుల కుమార్తె, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ జీవీ వెన్నెల గద్దర్ అందజేశారు. విశిష్ట అతిథిగా డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ కేంద్ర మంత్రి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా చైర్‌పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్, తెలంగాణ సాంస్కృతిక సారథి డా. వెన్నెల గద్దర్ పాల్గొన్నారు. ఆత్మీయ అతిథిగా రొయ్యూరు శేష సాయి, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ వ్యవస్థాపకులు హాజరయ్యారు. సభాధ్యక్షులుగా పుడమిక్ సాహితీ వేదిక వ్యవస్థాపకులు వ్యవహరించారు. ప్రత్యేక అతిథులుగా శ్రీధరావత్ బాల్సర్ నాయక్, యామినేని ఉప్పల్ రావు, మిర్యాల వెంకట్రావు పాల్గొని కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు. సాహిత్యం, సంస్కృతి, సామాజిక సేవ రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను గుర్తించి గద్దర్ స్ఫూర్తి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ గద్దర్ స్ఫూర్తితో ఇచ్చిన ఈ అవార్డు అందుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజల కోసం నా సేవలను మరింత అంకితభావంతో కొనసాగిస్తాను అని తెలిపారు.
