నేడు వడ్డేమాన్ లో శని త్రయోదశి ప్రత్యేక పూజలు...
నాగర్ కర్నూల్, బిజినపల్లి, జనవరి 30 (మనఊరు ప్రతినిధి: మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా ఈ నెల31న శనివారం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ వెల్దండ గోపాలరావు,ప్రధానార్చకులు గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. ప్రధాన అర్చకులు మాట్లాడుతూ జన్మరిత్యా, గోచార రీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమశని,అష్టమ శని, శని గ్రహ దోష పరిహారం పొందుటకు అన్నిరాశుల వారు శనీశ్వర స్వామి వారిని స్వయంగా దర్శించుకుని తిలతైల అభిషేక పూజలు చేయాలని ఆయన తెలిపారు. భక్తులకు స్నానాలకు నీటి వసతి, త్రాగుటకు మంచినీటి వసతి, ఉదయం నుండి 4 గంటల వరకు అల్పాహారవసతి కల్పిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరారు.

