బాలాపూర్ 62వ డివిజన్ అభివృద్ధే లక్ష్యం

 బాలాపూర్ 62వ డివిజన్ అభివృద్ధే లక్ష్యం

బీసీ జనరల్ రిజర్వేషన్ కింద బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధం

ప్రజల ఆశీర్వాదం కోరుతున్న సిల్వేరి సాంబశివ

బాలాపూర్, (మన ఊరు ప్రతినిధి): బాలాపూర్ 62వ డివిజన్ ప్రజలకు సిల్వేరి సాంబశివ నమస్కారం చేశారు. రాబోయే జీహెచ్‌ఎన్ ఎన్నికల్లో బీసీ జనరల్ రిజర్వేషన్ కింద బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా, ప్రజల ఆశీర్వాదంతో పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నట్లు ఆయన చెప్పారు.  కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ కలుపుకుని, ప్రజల సమస్యలే తన అజెండాగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. బాలాపూర్ డివిజన్ సమగ్ర అభివృద్ధికే తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. మీ కొడుకులా, మీలో ఒకడిగా నిరంతరం ప్రజల సేవలో ఉంటానని అన్నారు. ప్రజల ఆశీర్వాదమే తన బలం, వారి ప్రేమే తన ప్రేరణ అని సిల్వేరి సాంబశివ అన్నారు.

Previous Post Next Post