కల్వకుర్తి మున్సిపాలిటీ బీజేపీ ఎన్నికల ఇంచార్జిగా అందెల శ్రీరాములు

 కల్వకుర్తి మున్సిపాలిటీ బీజేపీ ఎన్నికల ఇంచార్జిగా అందెల శ్రీరాములు యాదవ్ 

కల్వకుర్తి, జనవరి 22 (మనఊరు ప్రతినిధి): రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కల్వకుర్తి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇంచార్జిగా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు అందెల శ్రీరాములు యాదవ్‌ను బీజేపీ రాష్ట్ర శాఖ నియమించింది. ఎన్నికల ఇంచార్జిగా నియమితులైన అనంతరం తొలిసారిగా కల్వకుర్తికి విచ్చేసిన సందర్భంగా స్థానిక బీజేపీ జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో సమిష్టిగా పనిచేయాలని.  ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.




Previous Post Next Post