9వ వార్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్
పట్టణవ్యాప్తంగా ప్రతిరోజూ పరిశుభ్రత కార్యక్రమాలు
జడ్చర్ల, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని 7వ రోజున 9వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత నర్సింలు, వైస్ చైర్‌పర్సన్ పాలాది సారిక రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ జి. లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ల పరిశుభ్రత, డ్రైనేజీల శుభ్రపరిచే పనులు చేపట్టారు. ప్రతి వార్డులో ప్రతిరోజూ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అలాగే 9వ వార్డులో 10 శాతం ల్యాండ్‌ను గుర్తించి బౌండరీలను ఫిక్స్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా జడ్చర్ల పట్టణంలోని ఇతర వార్డులలోనూ ఉన్న 10 శాతం ల్యాండ్‌ను గుర్తించి బౌండరీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చైతన్య చౌహన్, కుమ్మరి రాజు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ నరేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


