ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

 ఆలూరు జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవం

జడ్చర్ల రూరల్, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఆలూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పరిపాలనా బాధ్యతలను స్వీకరించి, స్వయం పరిపాలన విధానంపై ప్రత్యక్ష అనుభవంతో అవగాహన పొందారు. కార్యక్రమంలో హెచ్ఎంగా కృపాంజలి, కలెక్టర్‌గా గాయత్రీ, ఆర్‌జెడి‌గా కీర్తన, డీఈఓగా రాంచరణ్ తేజ్, ఎంఈఓగా దీపిక బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా మొత్తం 42 మంది విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలు పోషిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపె లింగయ్య, ఉపసర్పంచ్ మల్లేష్ యాదవ్‌తో పాటు ఉపాధ్యాయులు శ్రీను, అహ్మద్ షరీఫ్, అబ్దుల్ అలీమ్, హరిహరనాథ్, హైమావతి, సంధ్య, సోమ్ల, మంజుల, విజయప్రతాప్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.



Previous Post Next Post