రామాలయంలో కన్నుల పండుగగా గోదాదేవి కల్యాణం...
శీఘ్ర కళ్యాణం కొరకు 25 మంది చే గోదాదేవి రంగానాథుల కళ్యాణం..
భక్తిశ్రద్ధలతో 600 మంది పైగా భక్తులు....
నాగర్ కర్నూల్, జనవరి 16 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ లో గల శ్రీ సీతారామచంద్రస్వామి (రామాలయం)లో ధనుర్మాసం ప్రత్యేక పూజల కార్యక్రమంలో భాగంగా శుక్రవారంనాడు గోదాదేవి కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణులచే కనుల పండుగగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. వేదమూర్తులైన బ్రాహ్మణులచే వేదమంత్రో చరణాల మధ్య శాస్త్రాక్తంగా గోదాదేవి కల్యాణంలో ప్రత్యేక క్రతువులు విశ్వక్ సేన ఆరాధన,వాసుదేవ పుణ్యా వచనం,యజ్ఞోపవీత ధారణ,మధుపర్కం,మంగళాష్టకాలు,కన్యాదానం,జిలకర బెల్లం,మహ సంకల్ప పఠనం,మాంగల్య పూజ, మాంగల్య ధారణ,పూల మార్పిడి,పుష్పయాగం, తలంబ్రాలు,వేద ఆశీర్వచనం వేదమంత్రచరణల మధ్య చేశారు.పాల్గొన్న దంపతులకు సంతానం ఐశ్వర్యం కొరకు,25 మంది శీఘ్ర కళ్యాణం కొరకు,వారు కోరిన కోరికలు గోదాదేవి,రంగనాథ స్వాముల ఆశీర్వాదంతో నెరవేరుతాయి అని అన్నారు.గోదా రంగనాయక స్వామి వార్లకు సమర్పించిన తలంబ్రాలు భక్తులకు పంపిణీ చేశారు. కళ్యాణం లోపాల్గొన్న భక్తులందరికీ రామాలయ అన్నప్రసాద కమిటీ వారిచే, రామాలయ కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని సామూహికంగా పంపిణీ చేశారు. పాల్గొన్న భక్తులందరికీ ప్రత్యేకంగా వేద ఆశీర్వచనం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కందాడై శ్రీనివాస ఆచార్యులు,గోమటం మురళీ మోహనాచార్యులు,కందాడై గోపాలచార్యులు,చక్రవర్తి శ్రీనివాసచార్యులు, వెంకట్రామన్,వేణుగోపాల్, గోమటం శ్రీనివాస చార్యులు, గోపికృష్ణ,అజయ్ కుమార్, కరుణ శ్రీ,పద్మ,విజయలక్ష్మి, జయశ్రీ,రాధా,అర్థంరవీందర్, మల్లేష్, శివ,గొల్ల రాములు, నంద కిషోర్ భక్తులు,మహిళలు 600 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.









