కల్వకుర్తిలో మహిళ అదృశ్యం
భర్త ఫిర్యాదుతో కేసు నమోదు
కల్వకుర్తి, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి పట్టణంలో ఓ మహిళ అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. రెండవ ఎస్సై రాజశేఖర్ కథనం మేరకు… కల్వకుర్తిలోని సీబీఎం ఆస్పత్రిలో ఉల్పర నీలమ్మ ఆయాగా పనిచేస్తూ, కుటుంబంతో కలిసి పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 5న మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో కుటుంబ విషయమై జరిగిన గొడవ నేపథ్యంలో నీలమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధువులు, పరిచయస్తుల వద్ద ఆరా తీసినా ఎటువంటి సమాచారం లభించలేదని తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
