మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతాం

 మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తాం

సంక్షేమ పథకాలే విజయానికి బాటలు 

 మేకల స్వామి

కల్వకుర్తి రూరల్, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రంలో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ మేకల స్వామి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే పలు హామీలు అమలులోకి వచ్చాయని, ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు, రైతులు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తూ ప్రజల విశ్వాసం పొందిందని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నగరాల అభివృద్ధి, ప్రాంతీయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, మున్సిపాలిటీ ఎన్నికలకూ అదే స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో కల్వకుర్తి మున్సిపాలిటీలో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే గెలిచిందని, ఈసారి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని మేకల స్వామి ధీమా వ్యక్తం చేశారు.

Previous Post Next Post