జిల్లా ఆసుపత్రిలో అన్న ప్రసాదం పంపిణీ

 లయన్స్ క్లబ్ సేవా దృక్పథం

జిల్లా ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్న ప్రసాదం పంపిణీ

నాగర్ కర్నూల్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): లయన్స్ క్లబ్ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా ఆసుపత్రి ఆవరణలోని సత్యసాయి నిత్యాన్న భోజనశాలలో రోగుల వెంట వచ్చిన సహాయకులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ మెంబర్షిప్ జిల్లా కోఆర్డినేటర్ హకీమ్ విశ్వ ప్రసాద్ పాల్గొని స్వయంగా అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన లయన్స్ క్లబ్ సమన్వయకర్త, మాజీ క్లబ్ గవర్నర్ రాధాకృష్ణ మాట్లాడుతూ, లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు జనవరి 3 నుంచి వారం రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లయన్స్ క్లబ్‌లు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సేవా వారోత్సవంలో భాగంగా అన్న ప్రసాదాల పంపిణీ, వృద్ధాశ్రమాలకు సహాయం, పాఠశాలల్లో పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, అనాథలకు ఆహార పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎలిమె ఈశ్వరయ్య, సాయి సభ్యులు బిళ్లకంటి కృష్ణయ్య, సత్యనారాయణ, బాలకృష్ణ, లక్ష్మణ్, సాయి ప్రకాశ్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




Previous Post Next Post