జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

 🌸 మరికల్ జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు 🌸

విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ

చౌడపూర్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘసంస్కర్త, కవయిత్రి సావిత్రిబాయి ఫూలే జయంతిని చౌడపూర్ మండల పరిధిలోని మరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి, నారికేళం సమర్పించి వారి విద్యా–సామాజిక సేవలను కొనియాడారు. మహిళా విద్యకు మార్గదర్శకులైన సావిత్రిబాయి ఫూలే ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేసి, విద్యలో ముందంజ వేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సరస్వతి, ఉపాధ్యాయులు సౌజన్య మల్లప్ప, రామకృష్ణ, వెంకటయ్య, మల్లయ్య, అంజిలయ్య, హనుమయ్య, శశిధర్, ఇస్మాయిల్, పాండురంగయ్య చారి, అలాగే మనీషా, శ్రీలక్ష్మి రేఖ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post