ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

 ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

నేటి తరానికి స్ఫూర్తిదాయకం సావిత్రిబాయి పూలే జీవితం

బిజినేపల్లి, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): మహిళా విద్యా పితామహిగా, ప్రముఖ సంఘ సంస్కర్తగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నాగర్‌కర్నూల్ జిల్లా టి.ఎన్.జి.ఓ కార్యాలయంలో తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె జీవితం నేటి తరానికి, ముఖ్యంగా ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని సమాజంలో అక్షరాస్యత అభివృద్ధికి తమవంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ఆమె జీవితం నిరూపించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా, ఆర్గనైజింగ్ కార్యదర్శి రెడ్డి రామ్, నాగర్‌కర్నూల్ యూనిట్ కార్యదర్శి ఎం. సురేష్‌కుమార్, రామకృష్ణ, ట్రెజరర్ యాదగిరి, డీసీ మెంబర్ ఎం. ఆనంద్, బిజినేపల్లి యూనిట్ అధ్యక్షులు కళ్యాణ్ కృష్ణారావు, సభ్యులు పెద్దయ్య, మొగులాల్, జితేందర్, సంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






Previous Post Next Post