జిల్లా పరీక్షల నిర్వహణ అధికారిగా కురుమయ్య...
కురుమయ్యను సన్మానించిన ఉపాధ్యాయులు
నాగర్ కర్నూల్, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): జిల్లా పరీక్షల నిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి. కురుమయ్యని పాఠశాల ఉపాధ్యాయ బృందం శుక్రవారం ఘనంగా శాలువలతో సత్కరించారు. జిల్లా విద్యాశాఖలో పాఠశాల పరీక్షల నిర్వహణ బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యా రంగంలో కురుమయ్య అనుభవం జిల్లా స్థాయిలో పరీక్షల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కే. రమేష్, సాయిబాబు, సురేందర్, భాస్కర్, అజీమ్, నాగరాజు, మంజుల, లావణ్యలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
