ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 నందిహిల్స్ ఈస్ట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


హైదరాబాద్, జనవరి2 6 (మనఊరు ప్రతినిధి): హైదరాబాద్ లోని నందిహిల్స్ ఈస్ట్, 40 ఫీట్ రోడ్ కమర్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నందిహిల్స్ రోడ్ నంబర్–22 ఎక్స్ రోడ్స్, 40 ఫీట్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం దేశ ప్రజల ఐక్యత, సమానత్వం, స్వేచ్ఛకు ప్రతీక అని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. చివరగా స్వీట్లు పంపిణీ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.







Previous Post Next Post