శబానా బేగంకు ఉత్తమ సేవా అవార్డు
తొమ్మిదేళ్ల అంకిత సేవలకు గౌరవం
ఈజీహెచ్ఎస్ ఆఫీస్ అసిస్టెంట్ శబానా బేగం సన్మానం
ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సేవల్లో విశిష్ట కృషి
శబానా బేగంకు ఘన సన్మానం
జడ్చర్ల, జనవరి 26 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ఈజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో, ఈ కేంద్రంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా తొమ్మిదేళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న శబానా బేగంను ఆమె విశిష్ట సేవలకు గాను ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరి చేతుల మీదుగా ఆమెకు ఉత్తమ సేవా అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు సామాజిక సంస్థల ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె సేవలను కొనియాడారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి శబానా బేగంను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల రోజానామా ‘ఇతిమాద్’ పత్రిక తరఫున కూడా ఆమెను శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఇదే కార్యక్రమంలో జర్నలిజంలో సేవలందిస్తున్న రోజానామా ఇతిమాద్ జడ్చర్ల ప్రతినిధి మహమ్మద్ సత్తార్ ఆశిక్కూ ని కూడా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సత్కరించారు.
