గంగాపురంలో వైభవంగా శకటోత్సవం

 గంగాపురంలో వైభవంగా శకటోత్సవం

ఆకట్టుకున్న ఎడ్లబండ్ల అలంకరణ 

పోటెత్తిన భక్తజనం

జడ్చర్ల రూరల్, జనవరి 26 (మనఊరు ప్రతినిధి): మండలంలోని గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన శకటోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయం చుట్టూ శోభాయాత్రగా ప్రదర్శించారు. స్వామివారి దర్శనార్థం ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జడ్చర్ల సీఐలు కమలాకర్, నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవ వాతావరణంతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో కళకళలాడాయి.



Previous Post Next Post