పాలెంలో వైభవంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
వసంత పంచమి రోజున స్వామి వారి కళ్యాణోత్సవం
మాఘ మాసంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు – భారీగా తరలివచ్చిన భక్తులు
బిజినేపల్లి వారి పాలెం గ్రామంలో వెలిసిన శ్రీ అలువేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏట మాఘ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఛైర్మన్ మనుసాని విష్ణుమూర్తి, కార్యనిర్వాహణాధికారి సిహెచ్ రంగారావులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ మాసం వసంత పంచమి శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు శ్రీ అలెర్మెల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా ఉంచినట్లు. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ మాజీ దేవాలయ చైర్మన్ జున్నా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు నిత్య పూజలు, హోమం, బలిహరణ, అమ్మవారికి మరియు స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమాలు ఆలయ ప్రధానమైనవి. అర్చకులు కురవి రామానుజన్ ఆచార్యులు వేద బృందంతో కలిసి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మనుసాని విష్ణుమూర్తి కార్యనిర్వాహణాధికారి రంగారావు, గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు, మాజీ ధర్మకర్తల సభ్యులు గాడి సురేందర్, సొప్పరి బాలస్వామి, బోనాసి పెద్దకూర్మయ్య, మాజీ మండల అధ్యక్షులు పి. శ్రీనివాస్ గౌడ్, కొంకలి మధు, జగదీష్ ఉన్నారు. అలాగే దేవాలయ సిబ్బంది ఆర్. శివకుమార్, బాబయ్య, అర్చకులు జయంత్, శుక్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు.
